Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాచా చౌదరి: మిస్టర్ కూల్‌కు కొత్తపేరు పెట్టిన ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan On Secret Behind CSKs Home Dominance
Advertisement
  • చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు చేరుతుందన్న ఇర్ఫాన్
  • ఏ జట్టు వచ్చినా చాచా చౌదరి స్టేడియం తలుపులు మూసేస్తాడని వ్యాఖ్య
  • వ్యూహాలతో ప్రత్యర్థి జట్టును ఇరుకున పడేస్తాడన్న మాజీ ఆల్ రౌండర్
Advertisement
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కొత్త పేరు పెట్టాడు. ధోనీని అభిమానులు, తోటి క్రికెటర్లు మిస్టర్ కూల్, తలా, కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడు ధోనీని 'చాచా చౌదరి' అంటూ పఠాన్ కొత్త పేరుతో పిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో తప్పకుండా ప్లేఆఫ్స్ కు చేరుతుందని, ప్రస్తుతం చెన్నైని టాప్ 2లో నిలిపేందుకు ధోనీ ప్రయత్నాలు చేస్తున్నాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.

తమ సొంత మైదానం చేపాక్ కు ఏ జట్టు వచ్చినా చాచా చౌదరి ధోనీ స్టేడియం తలుపులు మూసేస్తాడని చెప్పాడు. ప్రత్యర్థి జట్టుపై కనికరం లేకుండా తన వ్యూహాలతో ఇరుకున పెట్టి పైచేయి సాధిస్తాడన్నాడు. చెన్నై అత్యంత పటిష్ఠమైన జట్టు అని, ఎదుటి జట్టుతో తనదైన రీతిలో వ్యవహరిస్తుందని ప్రశంసించాడు. 

కాగా, ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌లలో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.
Advertisement
Advertisement
MS Dhoni
Irrfan Khan
Cricket

More Telugu News